|
ఆహ్వానం:
తేది 17-03-2008 నుంచి 29-03-2008 వరకు శ్రీ
లక్ష్మినరసింహస్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారల
బ్రహ్మోత్సవములు జరుగును. భక్తులు అధిక సంఖ్యలో
పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
పూర్తి వివరములకై ఇక్కడ
క్లిక్ చేయండి.
గమనిక:
తేది. 18-03-2008 రోజున
స్వామివారి కళ్యాణం చేయించే భక్తులు రూ.300/-
టికెట్ తీసుకొనగలరు. నిత్య కళ్యాణ దాతలకు వారి
వారి తేదీల్లోనే కళ్యాణం జరిపించ బడుతుంది.
స్వామివారి కళ్యాణం (18-03-2008) రోజున
నిత్యకళ్యాణం చేయించటం వీలుకాదు.
బ్రహ్మోత్సవాలు జరుగు రోజుల్లో ఆలయం ఉ. 6గం. నుంచి
రాత్రి 9గం.ల వరకు తెరచి ఉంటుంది.
భక్తులకు విజ్ఞప్తి:
భక్తుల సౌకర్యం కొరకు దేవస్థానంలో పలు నిర్మాణ
కార్యక్రమములు చేపట్టారు.
ఇట్టి నిర్మాణ కార్యక్రమములో
పాల్గొన దలచిన భక్తులు తమ విరాళములను స్వయంగా కానీ
M.O/DD రూపంలో కాని
కార్యనిర్వహణాధికారి, శ్రీ లక్ష్మినరసింహ
స్వామిదేవస్థానం, ధర్మపురి పేర చెల్లించి రశీదు
పొందగలరు.
|